calender_icon.png 10 October, 2024 | 1:44 PM

రతన్ టాటా మరణంతో గుండె పగిలిన సిమి గరేవాల్

10-10-2024 11:56:05 AM

దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా దేశవ్యాప్తంగా ఉన్న చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నిన్న రాత్రి అనారోగ్యంతో రతన్ టాటా కన్నుమూశారు. ఆయన మృతి అందిరినీ కలిచివేస్తోంది. రతన్ టాటా మృతి తీరని లోటు అంటూ నివాళులర్పిస్తున్నారు. అయితే రతన్ టాటా మాజీ ప్రియురాలు, సినీనటి సివి గరేవాల్ కూడా సంతాపం ప్రకటించారు. నువ్వు వెళ్లిపోయావని వాళ్లు చెబుతున్నారు. కానీ నిన్ను కోల్పోయిన బాధను భరించడం కష్టం, వీడ్కోలు నేస్తమా అంటూ తామరిద్దరూ కలిస్తున్న ఫొటోను ఎక్స్ లో పోస్టు చేసింది. నటి సిమి గరేవాల్ తో కొన్నాళ్ల పాటు రతన్ టాటా డేటింగ్ ఉన్నారు. ఆ తర్వాత విడిపోయి ఫ్రెండ్‌షిప్ కొనసాగించారు. పద్మవిభూషణ్ గ్రహీత అయిన రతన్ టాటాకు సాటిలేని విజయాల వారసత్వం ఉన్నప్పటికీ, అతను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. తన జీవితాంతం ఒంటరిగా ఉన్నాడు. రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి ఇప్పుడు వారసుడు ఎవరు అనేది చిక్కుముడిగా మారింది.