లప్లాగ్నె (ఫ్రాన్స్): అంతర్జాతీయ చెస్ వేదికపై తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ సత్తా చాటాడు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన లప్లాగ్నె అంతర్జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో రిత్విక్ రజతంతో మెరిశాడు. టోర్నీలో మొత్తం 9 రౌండ్లు జరిగాయి. రిత్విక్ తొమ్మిది గేముల్లో ఐదు గెలిచి.. నాలుగు ఓడిపోయి ఏడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మౌసార్డ్ జూల్స్ (7.5 పాయింట్లు) స్కోరు చేసి తొలి స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. మరో భారత గ్రాండ్‌మాస్టర్ ఇనియన్ పన్నీర్‌సెల్వం ఏడు పాయింట్లు స్కోరు చేసి కాంస్యం గెలుచుకున్నాడు.