న్యూఢిల్లీ: వరల్డ్ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ రమేశ్బాయి పతకంతో మెరిశాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ ఈవెంట్లో రెండో స్థానంలో నిలిచిన రమేశ్ (252.1) రజ తం ఒడిసిపట్టాడు. చెక్ రిపబ్లిక్ షూట ర్ జిరి ప్రివ్త్స్క్రీ (252.2 పాయిం ట్లు) స్కోరు చేసి పసిడి సొంతం చేసుకోగా..
కేవలం 0.1 పాయింట్ తేడాతో రమేశ్ స్వర్ణం చేజార్చుకున్నాడు. ఇదే విభాగంలో పోటీ పడిన ఒలింపియన్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ పొజిషన్ ఈవెంట్లో సిఫ్త్ కౌర్ సమ్రా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక స్వర్ణం సహా తొమ్మిది పతకాలు సాధించింది.