22-01-2025 12:46:49 AM
ముషీరాబాద్, జనవరి 21: ఈనెల17 నుంచి 21 వరకు గుల్మార్గ్, కశ్మీర్‌లో జరిగిన 4వ నేషనల్ ఐస్ కర్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో తెలంగాణ నుంచి సీనియర్ ఉమెన్స్ టీంలో పాల్గొన్న లయన్ వీ వసంత మాధురి, ఎం నాగ అక్షయ, కునదొడ్డి స్టెల్లా దీపిక, కునాదొడ్డి రచ్చేల్.. రజత పథకాలు కైవసం చేసుకున్నారని కర్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి వీ వసంత కుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ నుంచి బుర్ర మలి పవన్ కుమార్, జీ కృష్ణమూర్తి, నీలాసాయి, సోహాన్ పాల్గొనగా దేశంలోని 18 రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా పోటీదారులు పాల్గొన్నట్లు తెలిపారు. విజేతలను కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మొహ్మద్ డానిష్, మొహ్మద్ అర్షద్ తదితరులు అభినందించారు.