calender_icon.png 12 February, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన శిశు మందిర్ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు

09-02-2025 05:55:32 PM

ఘనంగా 1999- 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమ్మేళనం..

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 1999-2000 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలు పలువురిని అలరించాయి.  25 ఏళ్ల విరామం తరువాత పూర్వ విద్యార్థులు ఒకేచోట కలుసుకొని తమ బాల్యాను భూతులను పంచుకుని, ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యా బుద్దులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. అంతే కాకుండా 2000 సంవత్సరంలో ప్రధానాచార్యులుగా బాధ్యతలు నిర్వహించిన రావుల సుధాకర్ రావు షష్టిపూర్తినీ పురస్కరించుకుని రావుల సుధాకర్ రావు-రమాదేవి దంపతులను పూర్వ విద్యార్థులు గజమాలతో ఘనంగా సత్కరించి, వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 

ఈ సందర్భంగా అప్పటి ప్రదానాచార్యులు సుధాకర్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులే నా సంపద అని, పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో షష్టిపూర్తి వేడుకలు జరగడం  గొప్ప ఆనందాన్ని ఇచ్చిందనీ అన్నారు. 2000 బ్యాచ్ విద్యార్థులు ఎంతో ప్రేమతో, గౌరవంతో నన్ను సన్మానించడం నా జీవితంలో మరిచి పోలేనిదని, చిరస్థాయిగా నిలిచిపోతుందనీ స్పష్టం చేశారు. నా శిష్యులంతా ఉన్నత స్థానాలను అధిరోహించి సమాజంలో ఆదర్శప్రాయులుగా నిలవాలని అని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను చేకూర్చేందుకు, సాంప్రదాయ నృత్య కళ అయిన కూచిపూడి ప్రదర్శన ఏర్పాటు చేసి గురువులను వేదికపైకి ఆహ్వానించడం ప్రత్యేకత సంతరించుకుంది. కూచిపూడి నాట్యగురువు అన్నం కల్పన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, తన అద్భుతమైన నృత్యంతో హర్షధ్వానాలు అందుకున్నారు. విద్యార్థులు ఆమెను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో 1999-2000 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు, అప్పటి గురువులు, ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.