calender_icon.png 17 October, 2024 | 5:03 PM

వెండి ఆభరణాలు భద్రంగా..

17-10-2024 12:00:00 AM

ప్రస్తుతం చాలామంది సిల్వర్ జ్యువెలరీ ధరించడానికి మొగ్గు చూపుతున్నారు. స్టులిష్‌గా ఉండటంతో పాటు బడ్జెట్‌లో వస్తుండటం, వీటిలో కూడా అనేక డిజైన్లు మార్కె ట్లో అందుబాటులో ఉండటంతో అందరూ వీటికే ఓటేస్తున్నారు. అయితే సిల్వర్ జ్యువెలరీని సరిగ్గా భద్రపరచ కపోతే అవి రంగు మారి మెరుపును కోల్పోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.. 

* మేకప్, పెర్‌ఫ్యూమ్ స్ఫ్రే చేసుకోవడం పూర్తయ్యాకే సిల్వర్ యాక్సెసరీస్ ధరించాలి. లేదంటే వీటిలోని రసాయనాలు ఆభరణాల మెరుపును దెబ్బతీస్తాయి. 

* ఇంటి పనులు చేసేటప్పుడు, స్విమ్మింగ్ చేసేటప్పుడు, అధిక సూర్యరశ్మిలో ఇవి ధరించినా రంగు మారిపోతాయి. 

* సిల్వర్‌తో తయారు చేసిన ఆభరణాలను శుభ్రం చేయడానికి లిక్విడ్ రూపంలో ఉన్న క్లీనర్లను ఉపయోగించకూడదు. ఇంట్లో లభించే వెనిగర్, బేకింగ్ సోడా.. వంటి నేచూరల్ క్లీనర్స్‌తో వీటిని శుభ్రం చేయడం మంచిది. 

* వీటిని ప్రతిసారీ శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. తీసిన తర్వాత కాటన్ లేదా మస్లిన్ వస్త్రంతో శుభ్రంగా తుడిస్తే సరిపోతుంది. 

జాగ్రత్తలు..

* సిల్వర్ జ్యువెలరీని గాలి తగలని, పొడి ప్రదేశంలో భద్రపరచాలి. అలాగే ఇతర ఆభరణాలతో కాకుండా వీటిని విడిగా భద్రపరచాలి. 

* ఈ ఆభరణాలు ఉంచే ప్రదేశం మరింత పొడిగా ఉండేందుకు ఆ ప్రాంతంలో ఒక చాక్‌పీస్ లేదా సిలికా జెల్ సాచెట్‌ని ఉంచవచ్చు. ఇవి గాలిలోని తేమను పీల్చుకోవడం ద్వారా ఆభరణాలు మెరుపు తగ్గకుండా కాపాడతాయి. 

* జిప్‌లాక్ సౌకర్యం ఉండే ప్లాస్టిక్ బ్యాగ్‌లో వీటిని భద్రపరచడం ద్వారా ఈ ఆభరణాలు మెరుపు కోల్పోకుండా జాగ్రత్తపడవచ్చు. 

* వర్షాలు పడుతున్నప్పుడు వెండి ఆభరణాలు ధరించకపోవడం మంచిది. ఒకవేళ అవి తడిచినా ముందుగా వాటిని పొడిగా ఆరబెట్టి తర్వాతే భద్ర పరచాలి.