జెనీవా: భారత అథ్లెట్ తేజస్ శిర్సే వరల్డ్ అథ్లెటిక్స్ మీట్‌లో రజతంతో మెరిశాడు. జెనీవా వేదికగా జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్‌లో శనివారం 110 మీటర్ల హార్డిల్స్ ఫైనల్లో తేజస్ రేసును 13.60 సెకన్లలో పూర్తి చేసి రజతం చేజెక్కించుకున్నాడు. జాన్ పెరెడ్స్ (13.49 సెకన్లు), మార్టిన్ సాంటా మారియాలు (13.65 సెకన్లు) వరుసగా స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు. ఒలింపిక్స్ 110 మీటర్ల హార్డిల్స్ నిర్దేశిత కటాప్ 13.27 సెకన్లు కావడంతో తేజస్ పారిస్ టికెట్ అందుకోలేకపోయాడు. మహిళల లాంగ్‌జంప్‌లో భారత లాంగ్‌జంపర్ శైలీ సింగ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే తేజస్, శైలీ సింగ్‌లకు ఈ నెల 27 నుంచి 30 వరకు పంచకుల వేదికగా జరగనున్న జాతీయ ఇంటర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు చివరి అవకాశం.