calender_icon.png 17 January, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుహాస్ యతిరాజ్‌కు రజతం

03-09-2024 01:39:00 AM

ఫైనల్లో భారత షట్లర్ ఓటమి

పారిస్: పారాలింపిక్స్‌లో భారత్ షట్లర్లు జోరు కనబరుస్తున్నారు. బ్యాడ్మింటన్‌లో ఇవాళ  మూడు పతకాలు రాగా.. తాజాగా సుహాస్ యతిరాజ్ రూపంలో నాలుగో పతకం వచ్చి చేరింది. సోమవారం పురుషుల బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్ 4 కేటగిరీ స్వర్ణ పతక పోరులో భారత్ పారా షట్లర్ సుహాస్ యతిరాజ్ రజతం సాధించాడు.ఫైనల్ పోరులో  మజూర్ లుకాస్ (ఫ్రాన్స్) చేతిలో 21 21 తేడాతో సుహాస్ పరాజయం పాలయ్యాడు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సుహాస్ ఫైనల్లో పూర్తిగా చేతులెత్తేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన రెండో సీడ్ మజూర్ లుకాస్ వరుస గేముల్లో  సుహాస్‌ను ఓడించి స్వర్ణం చేజెక్కించుకున్నాడు. కాగా సుహాస్ యతిరాజ్ టోక్యో పారాలింపిక్స్‌లోనూ రజత పతకంతో మెరిశాడు. ఈసారి కచ్చితంగా పసిడి నెగ్గుతాడనుకున్న తరుణంలో సుహాస్ మరోసారి రజత పతకానికే పరిమితమయ్యాడు.