న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ సోనమ్ ఉత్తమ్ మస్కర్ పతకంతో మెరిసింది. మంగళవారం మహిళల 10 మీ ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో సోనమ్ 252.9 పాయింట్లు స్కోరు చేసి రజతం ఒడిసిపట్టింది. చైనా షూటర్ హ్యుయాంగ్ (254.4 పాయింట్లు), ఫ్రాన్స్ షూటర్ ముల్లర్ (231.1 పాయింట్లు) స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు.
పురుషుల 10 మీ ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్ బబూతా ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక పురుషుల 10 మీ ఎయిర్ పిస్టల్ విభాగంలో అర్జున్ సింగ్ (8వ స్థానం)లో నిలవగా.. మహిళల విభాగంలో రిథమ్ సంగ్వాన్ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది.