calender_icon.png 20 April, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెక్కన్ టోల్ వేస్‌కు రజత అవార్డు

17-04-2025 12:46:45 AM

కేంద్ర మంత్రి గడ్కరీ చేతుల మీదుగా ప్రదానం

మునిపల్లి, ఏప్రిల్ 16 : గ్రీన్ హైవేస్ కేటగిరిలో డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్ ( డిపిఎల్) కు రజత అవార్డు దక్కింది.  ఈ సందర్భంగా ఈ అవార్డును రోడ్డు రవాణా, రహదారుల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఈనెల 15న టోల్వేస్ ప్రతినిధులు అందుకున్నారు. ఇందులో భాగంగానే కర్ణాటక, తెలం గాణ రాష్ట్రాల్లోని ఎన్హెచ్ 65 , మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు నుంచి తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి విభాగానికి రాయితీదారుగా ఉన్న డిటిఎల్ ప్రాజెక్ట్ హైవేపై చేపడుతున్న పచ్చదనం, పరిశుభ్రత, నీటి సేకరణ, మొక్కలు నాటడం, నీటి నిర్వహణ తదితర సౌకర్యాలు కల్పించడంతో ఈ అవార్డు దక్కిందని డిటిఎల్ ప్రాజెక్ట్ హెడ్ రాజేష్ విచారేతెలిపారు.