జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్‌సిటీబ్యూరో, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : వాణిజ్య సముదాయాలు, ఆస్పత్రులు, వసతిగృహాలు తదితర యజమానులు సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం ఓఅండ్‌ఎం డివిజన్-- పరిధిలోని గౌలిగూడ, కింగ్‌కోఠి ప్రాంతాల్లో అశోక్‌రెడ్డి పర్యటించారు.
గౌలిగూడలో కలుషిత నీరు సరఫరా అవుతుందనే ఫిర్యాదులు రావడంతో పొల్యూషన్‌ను గుర్తించే ఐడెంటిఫికేషన్ మిషన్ పనితీరును పరిశీలించారు. అనంతరం సుల్తాన్‌బజార్‌లో డీసిల్టింగ్ పనులను, మాదా పూర్, అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లోని ట్రాన్స్ మిషన్ లీకేజీలను పరిశీలించారు.
కొత్తగా నిర్మించిన భవనాలు, బహుళ అంతస్తుల్లో సీవరేజీ కనెక్షన్లు లేని భవన యజమానులకు నోటీసులు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ డైరెక్టర్ విజయరావు, సీజీఎం ప్రభు, జీఎం, అధికారులు పాల్గొన్నారు.