14-03-2025 12:00:00 AM
అక్కినేని అఖిల్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేక పోతున్నాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకుని మరీ సెట్స్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమా సెట్స్‌లోకి అఖిల్ ఇవాళే అడుగు పెట్ట బోతున్నాడని సమాచారం. నందు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.
అధికారిక ప్రకటన ఏమీ ఇవ్వకుండానే అఖిల్ సైలెంట్‌గా సెట్స్ మీదకి వెళ్లబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు టైటిల్ కూడా ముందుగానే బయటకు వచ్చింది. ‘లెనిన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తొలి షెడ్యూల్‌నే చాలా భారీగా ప్లాన్ చేశారని సమాచారం. ఏకధాటిగా 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుందట.
చాలా వరకూ షూటింగ్ అంతా హైదరాబాద్‌లోనే ఉంటుందని సమాచారం. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఫారిన్ లొకేషన్స్ అనేది ఏమీ పెట్టుకోకుండా లోకల్‌గానే పూర్తి చేస్తారని సమాచారం. ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందట. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోందని తెలుస్తోంది.