‘పుష్ప 2’ చిత్రం విడుదలయ్యాక హీరో అల్లు అర్జున్ జోష్‌ను అంతా చూశాం. కానీ సంధ్య థియేటర్ ఘటన వరకూ అల్లు అర్జున్ వేరు.. ఘటన తర్వాత వేరు. ఒకే ఒక్క ఘటన ఆయనలో చాలా మార్పు తెచ్చినట్టుగా అనిపిస్తోంది. సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడని టాక్. శ్రీతేజ్‌ను ఆసుపత్రిలో పరామర్శించి వచ్చిన అనంతరం అల్లు అర్జున్ తన తదుపరి సినిమా కార్యాచరణలోకి దిగిపోయాడని సమాచారం.
‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ ఏడాది కాలంగా అల్లు అర్జున్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటున్నారని సమాచారం. తాజాగా త్రివిక్రమ్‌ొోఅల్లు అర్జున్ నడుమ స్టోరీ డిస్కషన్ కూడా పూర్తయిందట.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారట. ఇదీ సైలెంట్‌గానే చేస్తారని సమాచారం. ఆ తరువాత జవనరి నెలాఖరు నాటికి సినిమాను పట్టాలెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి దీనిలో నిజ మెంతో తెలియాలంటే కొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.