calender_icon.png 29 September, 2024 | 3:56 AM

తస్మాత్ జాగ్రత్త..సైలెంట్ డీహైడ్రేషన్..వస్తుంది!

05-09-2024 12:16:25 PM

హైదరాబాద్: ఒక హిందీ పాటలో చెప్పినట్లు.. సారా సముందర్ మేరీ పాస్ హై.. ఎక్ బూంద్ పానీ మేరీ ప్యాస్ హై.. ( సముద్రమంత నీటిలో ఈత కోడుతున్నా.. కానీ గొంతు తడుపుకోవటానికి ఒక చుక్క నీరు లేదు..).. ఇప్పుడు సదరు చుక్క నీటిలో.. ఎలక్ట్రోలైట్స్  ఉన్నాయా ? లేవా ? అని మరొక్కసారి చూసుకోవాలంటున్నారు.. సాధారణంగా పనిచేయడానికి అవసరమయ్యేదాని కన్నా ఎక్కువ ద్రవాలు, నీటిని శరీరం కోల్పోతున్నపుడు డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇధి ద్రవాలను ఎక్కువ కోల్పోవటం లేదా తీసుకోవడం తగ్గిపోవడం వల్ల గానీ లేదా రెండు సందర్భాలలో జరగొచ్చు. ద్రవాల నష్టంలో ఎల్లపుడూ కొంత ఎలక్ట్రొలైట్ నష్టం ఉంటుంది. సాధారణ శరీర పనితీరులో ఇవి చాలా కీలకం. సైలెంట్ డీహైడ్రేషన్ అనేది సాధారణ రూజువారి పరిస్థతులలో మీకు కలుగ వచ్చు అంటున్నారు.

ఎలక్ట్రోలైట్స్ : డీహైడ్రేషన్ అరికట్టే సైలెంట్ హీరోలు

నీరు మాత్రమే చాలదు. డీహైడ్రేషన్ సమయంలో మనస్సుకు తూచే ఆలోచన నీరు. అయితే నీరు మాత్రమే డీహైడ్రేషన్ను అరికట్టడానికి సరిపోక పోవచ్చు ఎందుకంటే శరీరాన్ని సమతుల్యంగా ఉంచే అవశ్యకమైన ద్రవాల్లో ఎలక్ట్రోలై్ట్లు కొరవడి ఉండవచ్చని రెస్టోరేషన్ అండ్ డైజెస్టివ్ హెల్త్ నిపుణులు చెబుతున్నారు. సోడియంక్లోరైడ్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం తదితర ఎలక్ట్రోలైట్స్ అవసరం.   ఎలక్ట్రోలైట్స్ మన శరీరంలో సంకేతాలిచ్చే అణువులు. ఎలక్ట్రోలైట్స్ శరీరంలో ఉన్న నరాలు కండరాలు కణంలో ప్రయాణించి కండరాల సంకోచం, సడలింపులకు తోడ్పడతాయి. కణం లోపల బయట ద్రవాల నిల్వలను సమతా స్థితిలో నిర్శహించడానికి తోడ్పడుతాయి. ఉదాహరణకు డెస్క్ వద్ద కూర్చుని కీబోర్డు పై కీస్ ను టైప్ చేయటానికి ఎలక్ట్రోలైట్లు కావాలి. వ్యాయామం ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ ఉపయోగించుకుంటుంది. అయితే ఇవి కండరాలు, నాడులలో ప్రసరిస్తున్నందుకు కాదు.. చమట రూపంలో కోల్పోతున్నందుకు అందుకే ప్రతీ రోజూ ఎలక్ట్రోలైట్స్ తిరిగి భర్తీ చేసుకోవాల్సిందే నంటున్నారు.