calender_icon.png 21 October, 2024 | 7:18 AM

మౌనం మొదటికే మోసం

10-10-2024 12:00:00 AM

వివాహం జరిగి తర్వాత చాలా సందర్బాల్లో దంపతులు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు, ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణం. అయితే చాలా సందర్బాల్లో గొడవలు జరిగిన తర్వాత భర్తలు సైలెంట్‌గా ఉండిపోతారు. భర్త సైలెంట్‌గా ఉండిపోయాడు అంటే.. ‘అతను భయపడ్డాడు’ అని భార్యలు గుడ్డిగా నమ్మితే పోరపాటుపడినట్లే అవుతుంది. భర్త ఎందుకు మౌనంగా ఉన్నాడు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

చాలా ఫ్యామిలీల్లో భార్యల కంటే భర్తలు చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. భర్త ఎందుకు తక్కువగా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో భార్య చిరాకుగా మాట్లాడితే కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అతడు మౌనంగా ఉన్నాడంటే రకరకాల కారణాలుంటాయి. ఉద్యోగ నిర్వహణ, పిల్లల బాధ్యతలు, కుటుంబ పరిస్థితులు లాంటివి మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి.

అయితే ఉద్యోగ నిర్వహణలో బిజీగా ఉండే కొందరు చాలాసార్లు మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తే.. మరికొందరు ఇతర ఆలోచనలతో సతమతమవుతంటారు. అలాంటప్పుడే భార్యలు సంయమనం పాటించాలి. భర్త మనసును తెలుసుకొని మసులుకోవాలి. కొన్ని అంతర్గత భావాలను ఎలా వ్యక్తపరచాలో తెలుసుకోవాలి. 

భార్యే చొరవ తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి. భర్త మూడ్ మారిన తర్వాత తాను ఏం చెప్పాలని అనుకుందో ఆ విషయం క్లారిటీగా చెప్పాలి. అలా చెయ్యకపోతే దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. భార్య తెలివిగా వ్యవహరిస్తే సమస్యలు పెద్దవి కాకుండా వెంటనే పరిష్కారమవుతాయి.