calender_icon.png 14 November, 2024 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రూడోకు సిక్కుల షాక్

06-09-2024 12:00:00 AM

  1. మద్దతు ఉపసంహరించుకున్న జగ్మీత్ పార్టీ 
  2. సర్వేల్లో లిబరల్ పార్టీకి కరువైన మద్దతు 
  3. ప్రజల విశ్వాసం కోల్పోయారని జగ్మీత్ స్టేట్‌మెంట్ 
  4. బడ్జెట్ ఆమోదంపై దేశమంతా ఉత్కంఠ 
  5. ముందస్తు ఎన్నికలు కోరుతున్న కన్జర్వేటివ్ పార్టీ

ఒట్టవా (కెనడా), సెప్టెంబర్ 5: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రూడో నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఇన్ని రోజులుగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన జగ్మీత్‌సింగ్ నేతృత్వంలోని మిత్రపక్షం న్యూడెమోక్రటిక్ పార్టీ తన మద్దతును ఉపసంహరిం చుకోవడంతో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్ప డింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీపీ ప్రభుత్వం నుంచి వైదొలగడం గమనార్హం.

ఈ విషయంపై స్పష్టతనిస్తూ ఎన్డీపీ అధినేత జగ్మీత్ సింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. కొంతకాలంగా నిర్వహించిన సర్వేల్లో ప్రతిపక్షంగా ఉన్న కన్జర్వేటివ్ పార్టీ సులభంగా విజయం సాధిస్తుందని తెలుస్తోంది. అయినా ప్రధాని ట్రూడో దీన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆయన కార్పొరేట్ మాయలో ఉన్నారు. లిబరల్ పార్టీ ప్రజలను ప్రతిసారీ నిరాశ పరుస్తోంది. కెనడియన్లు వారికి మరో అవకాశమిచ్చే అవకాశం లేదు అని పేర్కొన్నారు. 

ప్రజల విశ్వాసం కోల్పోయింది

లిబరల్ ప్రభుత్వంతో తమ ఒప్పందం కూడా పూర్తి కాబోతోందని జగ్మీత్ వెల్లడించారు. రెండు పార్టీల మధ్య 2022లో ఒప్పందం జరిగింది. లిబరల్ నేతలు చాలా బలహీనంగా ఉన్నారని, నేతలందరూ స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. ప్రజల కోసం పనులు చేయకుండా కన్జర్వేటివ్‌లు, వారి ప్రణాళికలను ఎదుర్కొనేందుకు కార్పొరేట్ ప్రయోజనాలకు కట్టుబడి లిబరల్ పార్టీ పనిచేస్తోందని మండిపడ్డారు. పెద్ద కంపెనీలు, వాటి సీఈవోలతో కలిసి, వారి కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని జగ్మీత్ ధ్వజమెత్తారు. ఇది ప్రజల సమయమని, పెద్ద యుద్ధం జరగడం ఖాయమని, తాము ఎన్నికలకు సిద్ధంగా ఉందని జగ్మీత్ ప్రకటించారు. 2025 అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 

బడ్జెట్ విషయంలో ఇబ్బందులు

లిబరల్ పార్టీతో 2025 వరకు న్యూడెమోక్రటిక్ పార్టీ ఒప్పందం ఉంది. అప్పటివరకు ట్రూడోకు మద్దతు ఇస్తామని అంగీకరించారు. కానీ సర్వేలు నివేదికల నేపథ్యలో మద్దతు విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్‌డీపీ మద్దతు తో 2015 నుంచి ట్రూడో కెనడా ప్రధానిగా కొనసాగుతున్నారు. అయితే ఎన్‌డీపీ మద్దతు లేకపోయి నా ట్రూడో ప్రభుత్వానికి తక్షణ ప్రమాదమేమీ లేదు. రాజీనామా చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కానీ బడ్జెట్ ఆమోదం విషయంలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. బడ్జెట్ ఆమోదం కోసం విశ్వాస ఓట్లను తట్టుకుని హౌస్ ఆఫ్ కామన్స్ చాంబర్‌లోని ఇతర ప్రతిపక్ష సభ్యుల మద్దతు కోరాల్సి ఉంటుంది.    

విశ్వాసం తీర్మానం వైపు ప్రతిపక్షాలు

కన్జర్వేటివ్ నేత పియర్రీకి ప్రజల్లో ఆదరణ క్రమంగా పెరుగుతోంది. దేశంలో పెరుగుతున్న ధరలపై ఆయన గళమెత్తారు. కెనడాలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాం డ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 16 నుంచి హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సెషన్‌లో ప్రభుత్వంపై విశ్వాస  తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ ఓటి ంగ్ ఎన్‌డీపీ మద్దతుగా ఓటు వేస్తేనే ట్రూడో ప్రభుత్వం మనుగడ సాగించగలదు. ఈ విషయంపై స్పందించిన ఎన్‌డీపీ.. సమస్యలవా రీగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఓటింగ్‌లో లిబరల్స్‌కు మద్దతు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏదైమైనా ఈ ఏడాది చివర్లో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు ఆమోదం లభించకుంటే ఎన్నికలకు దారి తీసే ప్రమాదం అవకాశం ఉంటుంది.