calender_icon.png 10 April, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికందర్ నాచే..

18-03-2025 12:00:00 AM

బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్‌ఖాన్ టై టిల్ రోల్‌లో నటిస్తు న్న చిత్రం ‘సికందర్’. ఇందులో సల్మాన్ సం జయ్ రాజ్‌కోట్‌గా, సికందర్‌గా రెండు పా త్రల్లో అలరించనున్నా రు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. సాజిద్ నది యాడ్‌వాలా నిర్మాత కాగా రష్మిక మందన్న హీరోయిన్. మరో కథానాయిక కాజల్ అగర్వాల్ కూడా ఇందులో భాగమైంది. 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.  హోలీ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘భం భం భోలే శంభు..’ అనే గీతం విడుదలైంది.  మరో పాట విడుదల కానుందని తెలియజేస్తూ సోమవారం ‘సికందర్ నాచే..’ టీజర్ పేరుతో ఓ వీడియోను చిత్రవర్గాలు పంచుకున్నాయి. మంగళవారం రిలీజ్ కానున్న ఈ పాటలో డ్యాన్స్ ఫ్లోర్ స్టెప్పులు ఆకట్టుకుంటాయని పేర్కొన్నాయి.