బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘సికిందర్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న చిత్రాన్ని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. భావోద్వేగాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ పుట్టిన రోజును పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
సల్మాన్ యాక్షన్ సన్నివేశాన్ని టీజర్‌గా వదిలారు. ఇది సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర తీరును తెలియజేసేలా ఉంది. తనపై దాడి చేయడానికి వచ్చిన వారితో సల్మాన్ ఫైట్ చేస్తున్న సన్నివేశాన్ని టీజర్‌గా మేకర్స్ వదిలారు. వచ్చే ఏడాది రంజాన్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. వాస్తవానికి ఈ టీజర్‌ను సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 27నే విడుదల చేయాల్సి ఉంది కానీ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో టీజర్ లాంచ్‌ను వాయిదా వేశారు. ‘యానిమల్’ చిత్రంతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న రష్మికకు ‘సికిందర్’ ఆ క్రేజ్‌ను రెట్టింపు చేస్తుందో లేదో చూడాలి.