calender_icon.png 25 March, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రిప్రధాన్ ఆటకట్టించే సికందర్ మిషన్

24-03-2025 12:31:25 AM

బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సికందర్’. ఇందులో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నడియాడ్ వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియా డ్‌వాలా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా రంజాన్ కానుకగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. అభిమానులకు ముందుగానే ఈద్ తోఫా అందించినట్టయ్యింది.

తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఐదేళ్లలో 49 కేసులు పెండింగ్ ఉన్నాయి’ అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. సల్మాన్‌ఖాన్ పోషించిన సంజయ్ అనే పాత్ర వాంటెడ్ లిస్టులో ఉన్నట్టు పరిచయం చేశారు. అయితే, సంజయ్ (సల్మాన్) తన ప్రజలను కాపాడటానికి సికిందర్‌గా మారతారని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. మంత్రి ప్రధాన్ (సత్యరాజ్) అవినీతిని బయటపెట్టే లక్ష్యంతో ప్రారంభించిన ఒక మిషన్‌లో భాగంగా తన గ్యాంగ్‌తో కలిసి రాజ్‌కోట్ నుంచి ముంబైకి చేరుకుంటాడని తెలుస్తోంది. ట్రైలర్ రష్మిక.. సల్మాన్ భార్య పాత్రలో కనిపించగా, కాజల్ అగర్వాల్ కూడా ఓ సీన్‌లో మెరిసింది. సికందర్‌గా సల్మాన్ యాక్షన్‌తో ఆకట్టుకోనుండగా.. సత్యరాజ్ ప్రతినాయక పాత్రలో అలరిస్తారని తెలుస్తోంది.