calender_icon.png 18 January, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎకానమీ రికవరీ సంకేతాలు

09-01-2025 12:00:00 AM

బ్రిక్‌వర్క్ రేటింగ్స్

హైదరాబాద్, జనవరి 8: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కోలుకుంటున్న సంకేతాలు కన్పిస్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ రేటింగ్స్ తాజా రీసెర్చ్ రిపోర్ట్‌లో వెల్లడించింది. ద్వితీయ త్రైమాసికంలో నిరుత్సాహకరమైన 5.4 శాతం వృద్ధి రేటును కనపర్చిన ఆర్థిక వ్యవస్థ క్యూ3లో గణనీయంగా కోలుకుంటుందని, క్యూ3లో 6.5-7 శాతం మేర వృద్ధి సాధించవచ్చని పలువురు ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.

ప్రభుత్వ వినియోగం, పెట్టుబడుల మద్దతుతో  ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం, 2025 6.9 శాతం వృద్ధి సాధించవచ్చని ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారన్నది. 2024 క్యూ2లో జీడీపీ వృద్ధి ఏడు త్రైమాసికాల కనిష్ఠస్థాయి 5.4 శాతానికి తగ్గింది. ఈ స్థాయి నుంచి క్యూ3లో కనీసం 1 శాతం పెరుగుతుందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. 

రికవరీ సంకేతాలు..

* జీఎస్టీ వసూళ్లు క్యూ3లో 8.3 శాతం వృద్ధి చెందాయి. 

* సేవల రంగం వృద్ధిని సూచిస్తూ డిసెంబర్ నెలలో సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ (పీఎంఐ) ఇండెక్స్ 59.3 వద్దకు పెరిగింది. 

* తయారీ పీఎంఐ డిసెంబర్‌లో 12 నెలల కనిష్ఠం 56.4 వద్దకు 

తగ్గినప్పటికీ, క్యూ3లో సగటున 56.8గా నమోదయ్యింది.

* క్యూ3లో ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ 11.6 శాతం వృద్ధిచెందింది. వాహన రిజిస్ట్రేషన్లు 2024 అక్టోబర్‌లో అంతక్రితం ఏడాది ఇదేనెలతో పోలిస్తే 32.4 శాతం పెరిగాయి.