calender_icon.png 9 January, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్‌బోర్డులు పెట్టాలి

12-09-2024 12:00:00 AM

రాష్ట్రంలోని రహదారుల్లో చాలా చోట్ల ఏ మార్గం గుండా వెళ్తే ఏ ఊరు వస్తుందని తెలిపే సూచిక బోర్డులు అసలు లేవు. దీనివల్ల ఆ మార్గాల గుండా ప్రయాణించే కొత్త వాళ్లు తికమక పడుతున్నారు. దారిన వెళ్లే వారిని అడిగినా సరయిన సమాధానం లభించకపోవడంతో ఒక్కోసారి వేరే దారుల్లో వెళ్లి తిరిగి వెనక్కి రావలసిన పరిస్థితి వస్తోంది. వివిధ మార్గాల గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడకుండా తమ ప్రయాణం కొనసాగించడా నికి ఈ సూచిక బోర్డులు అత్యవసరమనే విషయాన్ని అధికారులు గ్రహించాలి.

అలాగే అక్కడక్కడ రోడ్లు దెబ్బతింటే మరమ్మతులు చేసే సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల చాలామంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు సైతం కో ల్పోతున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణిని విడనాడాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడెక్కడ సూచిక బోర్డులు అవసరమో గుర్తించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుకుంటున్నారు.

షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్