calender_icon.png 2 October, 2024 | 1:54 PM

సీతారాంపల్లిలో ఇసుక డంపుల సీజ్

02-10-2024 12:17:35 AM

మమా అనిపించిన అధికారులు!

మంచిర్యాల, అక్టోబర్ 1 (విజయక్రాంతి): విజయక్రాంతి దినపత్రికలలో సెప్టెంబర్ 27న ‘కలెక్టరేట్‌కు కూతవేటులో ఇసుక డంప్‌లు’ పేరిట ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. మంగళవారం సీతారాంపల్లిలో పలు ఇసుక డంప్‌లను సీజ్ చేశారు. అయితే సీతారాంపల్లిలో వందల ట్రిప్పుల ఇసుక డంప్‌లు ఉండగా కేవలం 135 ట్రాక్టర్ల ఇసుకను మాత్రమే సీజ్ చేశారు.

డంప్‌లు ఎన్ని మెట్రిక్ టన్నులు ఉన్నాయి, సీజ్ చేసింది ఎంత, డంప్‌లన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నా యి, ఎన్ని రోజులుగా నిలువ ఉన్నాయని సంబంధిత అధికారులు బహిర్గతం చేయకుండా నామమాత్రంగా సీజ్ చేసినట్టు తెలు స్తున్నది.

కొన్ని డంప్‌ల వద్దకు వెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చి పట్టుకున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వేల ట్రిప్పుల ఇసుక డంప్‌లుండగా వందల్లో చూపించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆధీనం లో ఉండటంతోనే మమా అని పించారని బాహాటంగా చెప్పుకుంటున్నారు.