08-02-2025 01:20:41 AM
మున్నూరుకాపుల పిలుపు
ముషీరాబాద్, ఫిబ్రవరి 7: మున్నూరు కాపులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గె శ్రీనివాస్ పటేల్ డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
మున్నూరుకాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయినందున ఈ నెల 12న సీఎం ఇంటిని ముట్టడించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక శాతం జనాభా కలిగిన మున్నూరు కాపులకు మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాచిగూడలోని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోమెంట్ పరిధి నుంచి తొలగించి మున్నూరుకాపులకు అప్పగించాలని అన్నారు. సమావేశంలో నాయకులు బత్తుల రాములు, అమరం శ్యామ్ కుమార్, వెంపటి సోమన్న, కిష్టంగారి ప్రకాష్, కటికం మహేష్, ప్రభాకర్, శ్రీనివాస్, అనిల్, సందీప్, మల్లేష్, అశోక్, శ్రీనివాస్, సంజీవ్, సత్యనారాయణ, నరేష్, యాదయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.