calender_icon.png 7 February, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12న సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి..

07-02-2025 04:57:36 PM

మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గే శ్రీనివాస్ పటేల్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): మున్నూరు కాపులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5000 కోట్ల నిధులు మంజూరు చేయాలని మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గే శ్రీనివాస్ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్నూరు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమైనందున ఈనెల 12వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక శాతం జనాభా కల్గిన మున్నూరు కాపులకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాచిగూడలోని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాంను ఎండోమెంట్ పరిధి నుంచి తొలగించి తిరిగి మున్నూరు కాపులకు అప్పగించాలని అన్నారు.

మున్నూరు కాపుల పేరు చివరన పటేల్ అని ప్రభుత్వం గెజిట్ చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపిటీసీ, జడ్పీటీసీలుగా బీసీలకు, మున్నూరు కాపులకు అధిక స్థానాలు కేటాయించాలని అన్నారు. తెలంగాణలో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మున్నూరుకాపు కులసంఘాల ప్రతినిధులను ఆహ్వానించి సమస్యలపై చర్చించి పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘాల ప్రతినిధులు బత్తుల రాములు, అమరం శ్యామ్ కుమార్, వెంపటి సోమన్న, కిష్టంగారి ప్రకాష్. కటికం మహేష్, పుప్పాల ప్రభాకర్, బిలకంటి శ్రీనివాస్, పత్తి అనిల్, రామిని సందీప్, మల్లేష్ ఓయు, కునిగిరి అశోక్, బత్తుల శ్రీనివాస్, గాజుల సంజీవ్, పుప్పాల సత్యనారాయణ, ఏనుగుల నరేష్, పి. యాదయ్య, పటోళ్ళ రవి, నాయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.