calender_icon.png 24 October, 2024 | 7:01 AM

సిద్దు పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది

02-08-2024 12:05:00 AM

‘అలనాటి రామచంద్రుడు’ హీరో కృష్ణవంశీ 

కృష్ణవంశీ జంటగా నటిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. ఈ సినిమాను చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకత్వంలో హైనివా క్రియేషన్స్ పతాకంపై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తు న్నారు. నేడు (శుక్రవారం) థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో హీరో కృష్ణవంశీ గురువారం విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. “చిన్నప్పుట్నుంచి సినిమాలంటే పిచ్చి. కాలేజ్ డేస్‌లో ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించా. ఇంజినీరింగ్ చేశా. క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చింది. సినిమా లపై ఇష్టం ఏమాత్రం తగ్గకపోవటంతో సత్యానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నా.

హైదరాబాద్ వచ్చి సినిమా ప్రయత్నాలు చేస్తుండగా, ఆకాశ్‌రెడ్డి గారు పరిచయమయ్యారు. నా ఆడిషన్స్ ఆయనకు నచ్చటంతో సినీ ప్రేక్షకులకు హీరోగా పరిచయమవుతున్నా. సినిమాలో నాది ఇంట్రో వర్ట్ క్యారెక్టర్. చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్. చాలా సెటిల్‌గా పెర్ఫార్మ్ చేసే రోల్. చేయడానికి చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ కథలో మంచి ఎమోషనల్ జర్నీ ఉంది. ఈ పాత్రకు చాలా దగ్గరగా ఉండే నా ఫ్రెండ్‌ను గుర్తు చేసుకొని ముందుకెళ్లా. నా పాత్ర పేరు సిద్ధు.. నిజాయితీ గల మనిషి. హీరోయిన్ పాత్ర పేరు ధరణి. మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. హీరోగా ‘అలనాటి రామచంద్రుడు’ నాకు తొలి మెట్టు. ప్రస్తుతం ఈ సినిమాపైనే దృష్టి పెట్టాను. కొన్ని కథలు విన్నాను. ఓ విలేజ్ డ్రామా సబ్జెక్ట్ చర్చల్లో ఉంది” అని తెలిపారు.