calender_icon.png 24 October, 2024 | 8:48 PM

మిస్టర్ బచ్చన్‌లో సిద్ధు..

02-08-2024 12:05:00 AM

‘మిస్టర్ బచ్చన్’గా మరికొద్ది రోజుల్లో తెరమీద సందడి చేయనున్నారు రవితేజ. అమితాబ్ బచ్చన్ అభిమానులైన దర్శకుడు హరీష్ శంకర్, హీరో రవితేజ చేసిన ఈ సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ అని పేరు పెట్టడంతోనే సినిమాలో బిగ్‌బీ ప్రస్తావన గురించి చెప్పకనే చెప్పారు. రవితేజతో ఆ లింక్ ఎలా కలిపారన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు. 1988 మధ్య జరుగనున్న ఈ సినిమాకి తనవైన హంగులెన్నో జోడించారు హరీష్ శంకర్.

తాజాగా ఈ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ రూపంలో మరో అదనపు ఆకర్షణ తోడైనట్టు సమాచారం. మన సినిమాల్లో ఇలాంటి అతిథి పాత్రలు మామూలే అనుకుందామంటే.. ఇందులో రవితేజ, సిద్ధుకి మధ్య ఓ ఫైట్ సీన్ కూడా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయిందట. రవితేజ ఎనర్జీకి, ‘టిల్లు’ కొట్టుడు తోడైతే థియేటర్లలో హోరు ఎలా ఉంటుందన్నది ఆగస్టు 15న తెలియనుంది.