శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడా నికి విటమిన్ సి చాలా ముఖ్యం. అందుకే వైద్యులు విటమిన్ సి పుష్కలంగా ఉన్న పదార్థాలను తినమని చెబుతారు. కానీ విటమిన్ సి శరీరంలో ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు: విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల కడుపులో చికాకు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు వస్తాయి. ఇది తీవ్రమైన జీర్ణక్రియ రుగ్మతలను కలిగిస్తుంది. జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉండాలంటే తగిన మోతాదులో విటమిన్ సి తీసుకోవాలి.
కిడ్నీ స్టోన్స్: విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది శరీరంలో ఆక్సలేట్ స్థాయిని పెంచుతుంది. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్లు రావడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది. అందుకే విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా ఉంటే చాలా మంచిది.
చర్మ సమస్యలు: విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మంపై చికాకు, దురద, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. ఇది చర్మాన్ని సున్నితంగా మార్చగలదు. ఫలితంగా డ్రై స్కిన్ సమస్య తలెత్తుంది. అంతేకాకుండా అలర్జీ సమస్యలు కూడా పెరుగుతాయి. సాధార ణంగా ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 2000ఎమ్‌జి విటమిన్ సి తీసుకోవడం సురక్షి తం. అయితే విటమిన్ సి సప్లిమెంట్లను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.