పెద్ద, చిన్నా అనే తేడా లేకుండా అందరు కాస్మో టిక్స్‌ను కుప్పలు తెప్పలుగా వాడేస్తున్నారు. నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ వీటి వ్యామోహం పెరుగుతుంది. ఎంత ఆదరణ పొందుతున్నా కాస్మొటిక్స్ వల్ల కలిగే అనర్థాలూ కూడా అంతే స్థాయిలో కనిపిస్తున్నాయి. కాస్మొటిక్స్ వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం..
- కాస్మొటిక్స్ వాడటం వల్ల ప్రాణహాని లేనప్పటికీ అనేక రకాలైన ఆరోగ్యసమస్యలు, ఇబ్బందులూ కలిగే ప్రమాదం ఉంది.
- ఒక్కరు వినియోగించే మేకప్ కిట్‌లను వేరేవాళ్లు వాడకూడదు. ఎందుకంటే కాస్మొటిక్ బ్రష్‌లు, స్పాంజ్‌ల ద్వారా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది.
- మేకప్ వేసుకోబోయే ముందు చేతులు శుభ్రం చేసుకుంటే ఈ సమస్య అంతగా ఉండదు.
- బాడీ స్ప్రే రూపంలో ఉండే సాందర్యసాధనాలు సాధార ణంగా ఆల్కాహాలిక్ సంబంధిత పదార్థాలతో తయారవుతుంటాయి. కాబట్టి వేడి ప్రాంతాల్లో ఉంచకూడదు. బాడీ స్ప్రే పడనివాళ్లకు చర్మంపై దద్దుర్లు, దురద వచ్చే అవకాశం ఉంది.
- కాస్మొటిక్ స్ప్రేల నుంచి వచ్చే సూక్ష్మమైన తుంపర్లు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి.
- ముఖ్యంగా సౌందర్య ఉత్పత్తులను వాడిన వెంటనే మూతపెట్టాలి. మూతలు లేని కాస్మొటిక్స్ మీద ఫంగస్ పెరుగుతుంది.