calender_icon.png 17 November, 2024 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దులగుట్ట రహదారి పనులు ప్రారంభించాలి

29-06-2024 01:51:11 AM

ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ వినతి

రాజేంద్రనగర్, జూన్ 28 (విజయ క్రాంతి) : ప్రసిద్ధిగాంచిన సిద్దులగుట్ట ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి పనులను త్వరగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను కోరారు. ఈ మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో గల పురాతన వెండికొండ సిద్దేశ్వర సిద్దులగుట్ట దేవాలయానికి వెళ్లడానికి రోడ్డు సరిగా లేదని, నూతన రోడ్డు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రామశర్మ తదితరులు పాల్గొన్నారు.