సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని సీతారాం పల్లి గ్రామానికి చెందిన గుర్రం గ్రీష్మ (35) నెల రోజులుగా జిబిఎస్ వ్యాధితో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. తరచుగా జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లిన గ్రీష్మకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు జిపిఎస్ వ్యాధి(GBS Disease) లక్షణాలున్నట్లు గుర్తించారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు బాధితురాలని హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు.