calender_icon.png 15 January, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం వరద బాధితులకు సిద్దిపేట వీడియో జర్నలిస్టుల విరాళం

05-09-2024 12:57:17 PM

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు నగదు అందిస్తున్న వీడియో జర్నలిస్టులు

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట వీడియో జర్నలిస్టుల  సంఘం ఖమ్మం వరద బాధితులకు ఉడతా సహాయంగా రూ. 10 వేల నగదు ఆర్థిక సహాయంగా విరాళ అందజేశారు. ప్రకృతివిలయంతో కాకవికలం అయిన వరద బాధితులను సిద్దిపేట వీడియో జర్నలిస్టుల సంఘం సహాయం అందించి మానవత్వాన్ని చాటారు. గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ను కలిసి తమవంతు సహాయన్నీ నగదును అందచేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు వారిని అభినందించారు. ప్రజా సేవకులు అయినప్పటికీ వీడియో జర్నలిస్టులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి వారికీ తోచినంతా సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వీడియో జర్నలిస్టులు ఎల్లోహార్, గిరి, వెంకట్, నవీన్, చందు, అంజి, నరేష్, రమేష్, ప్రవీణ్, కృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.