సిద్దిపేట (విజయక్రాంతి): మద్యం సేవించి వాహనం నడిపిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ హైదరాబాదులో హల్చల్ చేశారు. అమీర్‌పేటలోని ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో సిద్దిపేట ఏసిపి సుమన్ కుమార్ మద్యం సేవించి కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుపడ్డాడు. తాను పోలీస్ నేమ్ అంటూ అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు ప్రవర్తించడంతో వారు స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎసిపి సుమన్ కుమార్ కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించి మద్యం సేవించినట్లు నిర్ధారించిన పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.