calender_icon.png 11 March, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట మున్సిపాలిటీ బడ్జెట్ రూ. 75.19 కోట్లు

11-03-2025 12:21:37 AM

సిద్దిపేట, మార్చి 10 (విజయక్రాంతి): సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం సోమవారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ కడవేగ మంజుల అధ్యక్షతన, జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో 2024-25 రివైజ్డ్ బడ్జెట్, 2025-26 అంచనాల బడ్జెట్ ను చైర్పర్సన్ కడవేరుగు మంజుల ప్రవేశ పెట్టగా పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

అంచనా వేసిన ఆదాయం 2025-26సంవత్సరానికి గాను రూ.75 కోట్ల 19 లక్షల 8 వేలు కాగా 2025 -26 ఆర్థిక సంవత్సరానికి వ్యయంగా రూ.75 కోట్ల 14 లక్షల 06 వేలుగా కేటాయించారు. మిగులు బడ్జెట్ 5 లక్షల 2 వేలుగా కేటాయించారు. బ్యాలెన్స్ బడ్జెట్ నుండి మూడవ వంతు వెనుకబడిన కలనిల మురికివాడల, విలీన గ్రామాలలో మౌళిక వసతుల అభివృద్ధికి రూ.93లక్షలు కేటయించారు.

బడ్జెట్ మొత్తంలో (10శాతం) రూ.4.41 కోట్లు హరితహారానికి కేటయించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కమిషనర్ ఆశ్రిత్ కుమార్, కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు, మున్సిపల్ డీ ఈ ప్రేరణ పాండా, ఏ.ఈ లు, ఆర్.ఓ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.