calender_icon.png 21 September, 2024 | 2:14 PM

ఉపాధ్యాయుల కృషితోనే విద్యారంగంలో సిద్దిపేట ముందంజ

21-09-2024 11:19:19 AM

జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లెంకి శ్రీనివాస్ రెడ్డి

సిద్దిపేట,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల కృషి వల్లనే విద్యారంగంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో సిద్దిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో జిల్లా విద్యాధికారి పాల్గొని మాట్లాడారు. జిల్లా స్థాయిలో 27 మందిని వివిధ విభాగాల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం సంతోషకరమన్నారు. ఏ రంగంలోనైనా ఉత్తమ ఫలితాలు సాధించిన వారు ఉపాధ్యాయులు చేతిలో తీర్చిదిద్దబడ్డవారేనని తెలిపారు.

ఉన్నత, అత్యున్నత స్థాయిలకు ఎదుగుతున్నారని, ఉపాధ్యాయులు మాత్రం ఉపాధ్యాయులు గానే మిగులుతారన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు ఉత్తమ బోధనతో విద్యా ప్రమాణాల పెరుగుదలకు కృషి చేయడం అభినందనీయం అన్నారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడానికి ఉపాధ్యాయుల కృషి కారణమన్నారు. జిల్లాలో ఉత్తమ బోధనతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులను ఎవరి ప్రమేయం లేకుండానే  ఎంపిక చేసి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.

తొగుట మండలం రాంపుర్ కి చెందిన పేద మహిళలకు రూ.7 వేల కుట్టు మిషన్, ఆనంద నిలయంలోని నిశాంత్ ఆర్పాన్స్ 15 మంది విద్యార్థులకు కళ్ళ పరీక్షలు నిర్వహించి రూ.10 వేల కంటి అద్దాలను, రాంపూర్ పాఠశాలకు 4 వేల పలకలు,నోట్ బుక్స్, సామాగ్రి లను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ గవర్నర్ అమరనాథ రావు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంప రమేష్, పద్మావతి, నర్సింహారావు, క్లబ్ అధ్యక్షులు జోజి, కార్యదర్శి వై.వి.సురేశ్ కుమార్, కోశాధికారి నరసింహారెడ్డి, ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, వైకుంఠం, శేఖరం, నారాయణ, జెజె నాథ్, వినోద్ మోదాని, సత్యనారాయణ, వెంకటేశ్వర్ రెడ్డి, భాస్కర్, జ్యోతి, భాస్కర్ రెడ్డి, భగవాన్, చందు, విజయ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.