న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ సిద్ధార్థ్ కౌల్ గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2018-19 సమయంలో భారత్ తరఫున 3 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్, బెంగళూరు జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్లో పంజాబ్ తరఫున ఆడిన సిద్ధార్థ్ కౌల్ 88 మ్యాచ్‌ల్లో 297 వికెట్లు, 111 లిస్ట్-ఏ గేమ్స్‌లో 199 వికెట్లు, 145 టీ20ల్లో 182 వికెట్లు పడగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో 155 వికెట్లు పడగొట్టిన సిద్ధార్థ్ కౌల్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.