నటుడు సిద్ధార్థ్, నటి అదితిరావు హైదరీల ప్రేమాయణం వివాహ బంధంగా మారింది. ఉభయ కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని ఆలయంలో ఈ ప్రేమజంట వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అదితి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే చంద్రుడు.. నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు’ అని అదితి క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్గా మారాయి. కొంత కాలంపాటు లవ్ జర్నీ చేసిన ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సందర్భంగా అందరూ ఈ నవ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.