17-03-2025 04:43:07 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్ర శివారులోని సోమవారం శ్రీ సిద్ధ రామేశ్వర కళ్యాణం భక్తుల జన సందోహం మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. కామారెడ్డి జిల్లాలో అత్యంత ప్రాచీన ఆలయం శ్రీ సిద్ధరామేశ్వర ఆలయం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన సిద్ధరామేశ్వరాలయం భక్తుల కొంగుబంగారంగా కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.
ఆలయ పూజారి రామగిరి శర్మ, రాజు శర్మతో పాటు మరో ఇద్దరు పూజారులు నిత్యం సిద్దరామేశ్వర ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. సీతారామేశ్వర ఆలయంతో పాటు భువనేశ్వరీ మాత ఆలయంతో పాటు పలు ఆలయాలను భక్తులు సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మూల బావిలో స్నానం చేస్తే కష్టాలు తొలగి పోతాయని భక్తుల నమ్మకం, బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు మూల బావిలో స్నానం చేసిన అనంతరం సిద్దరామేశ్వరుని దర్శించుకుంన్నారు.
అనంతరం భువనేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకుని, మొక్కులు చెల్లిచారు. ఓడి బియ్యం పోసి, మహిళలు ముత్తైదువలు, సిద్దరామేశ్వరుని, భువనేశ్వరి దేవిని వేడుకున్నారు. కోరిన కోరికలు నెరవేరిచే దేవునిగా కామారెడ్డి జిల్లాలో ప్రసిద్ధి చెందిన సిద్ధరామేశ్వరాలయం బ్రహ్మోత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.