23-04-2025 12:00:00 AM
నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, ఓబీసీ జాతీయ మేధావుల ఫోరం అధ్యక్షుడు
ఆళ్ల రామకృష్ణ
ముషీరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): దేశ జనగణనతో పాటు కులగన చేయాలని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42 శాతం బీసీ బిల్లులను పార్లమెంటు లో ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని ఢిల్లీ కేంద్రంగా నేటికీ 22 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆజాది జేఏసీ చైర్మన్, హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర పటేల్ ఓబిసి ఇంటలెక్చువల్ ఫోరం జాతీయ అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళ వారం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమిం పజేశారు.
దీక్షను విరమింప చేసిన వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, సూరజ్ మండల్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఓబీసీ చైర్మన్ అనిల్ జైహింద్, సుప్రీంకోర్టు లాయర్ డాక్టర్ కె.ఎస్ చౌహన్, బీసీ ఆజాద్ ఫెడరేషన్ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, అంబేద్కర్ ఆజాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగర నరహరి, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. రామ్ నర్సయ్య, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల గారీ వెంకటస్వామి, విశ్వపతి, శివ, చతుర్భుజి, కమల్ ప్రసాద్ పాల్ తదితరులు పాల్గొన్నారు.