calender_icon.png 28 April, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాల తనిఖీలు చేపట్టిన ఎస్సై విజయ్ కొండ

27-04-2025 09:37:29 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం సలాబత్పూర్ చెక్ పోస్ట్ వద్ద ఆదివారం సాయంత్రం మద్నూర్ ఎస్సె విజయ్ కొండా(SI Vijay Konda) ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనఖీ చేశారు. వాహనదారులు సంబంధిత వాహన పత్రలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలిపెట్టారు. ప్రతి ఒక్కరు ట్రాపిక్ నిబంధనలను పాటిస్తూ, సంబంధిత పత్రాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలని వాహనదారులకు సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.