21-03-2025 12:07:22 AM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కొండపాక,మార్చి 20 : ఎస్ ఐ బెదిరింపులు తాళలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కుకునూరు పల్లి మండల కేంద్రంలో ఒక ఇంట్లో ఎలాంటి అనుమతి లేకుండా పాస్టర్ డేవిడ్ రాజ్ అలియాస్ చిలుముల సత్యనారాయణ చర్చి నిర్వహిస్తున్నారు.
ఆ చర్చి ప్రహారి గోడ ఇండ్ల శ్రీశైలం అనే వ్యక్తి ఇంటి గోడకు అనుకొని నిర్మించడంతో వీరిద్దరి మధ్య గత కొద్ది రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ మేరకు పాస్టర్ డేవిడ్ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎస్ ఐ తో బెదిరింపులకు గురి చేస్తున్నాడు. కుక్కునూరు పల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ చాలాసార్లు ఫోన్ చేసి బెదిరించారని శ్రీశైలం భార్య వసంత మీడియాతో తెలిపింది. .
గురువారం ఉదయం ఎస్‌ఐ శ్రీనివాస్ ఇద్దరు కానిస్టేబుల్లను శ్రీశైలం ఇంటికి పంపించి శ్రీశైలం ను భేదించడంతో మనస్థాపం చెందిన శ్రీశైలం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. శ్రీశైలంను వెంటనే గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
బాధితుడు శ్రీశైలంను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫోన్ లొ మాట్లాడి ఆరోగ్య విషయాలు తెలుసుకుని పరామర్శించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.