కామారెడ్డి, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో సెటల్ఫోన్ పోగొట్టుకొన్న బాధితులకు ఆదివారం ఎస్త్స్ర అనిల్ కుమార్ రెండు సెల్ ఫోన్లను అప్పగించారు. మండలంలోని గజ్జ నాయక్ తండా చెందిన రామావత్ రాజు మాచారెడ్డి ఎక్స్ రోడ్ కు చెందిన లావణ్య ప్రకాష్ ఫోన్లు చోరీకి గురికాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్లు ఆధారంగా సి ఈ ఐ ఆర్ నెంబర్ ద్వారా ట్రేస్ చేసి రెండు సెల్ ఫోన్ లను బాధితులకు అప్పగించినట్లు ఎస్త్స్ర తెలిపారు.