17-04-2025 06:16:29 PM
ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్..
పాపన్నపేట: రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, అందువల్ల రైతులు ఎవరు రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టకూడదని ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్(SI Srinivas Goud) రైతులకు సూచించారు. గురువారం ఆయన మిన్ పూర్, యూసుఫ్ పేట శివార్ల వద్ద రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ... ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రాత్రివేళ ధాన్యం కుప్పలపై నల్లని టార్ఫాలిన్ కప్పి ఉంచడం వల్ల అవి వాహనదారులకు కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. ధాన్యం కుప్పల వద్ద ప్రమాదాలు జరిగితే సదరు ధాన్యంకు చెందిన రైతులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వేరే చోట ధాన్యం ఆరబోసుకోవాలన్నారు. ఈ విషయంలో రైతులు సహకరించాలని సూచించారు.