calender_icon.png 2 April, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన ఎస్సై...

31-03-2025 07:46:39 PM

అభినందించిన యువకులు...

గుడిహత్నూర్ (విజయక్రాంతి): గ్రూప్-1 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుడిహత్నూర్ ఎస్సై కరాండే మహేందర్ డీఎస్పీగా ఎంపికైయ్యారు. దీంతో సోమవారం రత్న సాన్వి వెల్ఫర్ సొసైటీ వ్యవస్థాపకుడు ఉప్పారపు సత్యరాజ్ ఎస్ఐ ని కలిసి అంబెడ్కర్ చిత్రపటాన్ని బహుకరించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ... పట్టుదల, ఏకాగ్రతతో చదివి డిఎస్పీ ఉద్యోగాన్ని సాధించిన ఎస్సై మహేందర్ ను పలువురు యువకులు స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో అమరేశ్వర్, సతీష్, రాహుల్, గణేష్, అశోక్, రాంకుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.