calender_icon.png 12 March, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూఫ్ ఫలితాల్లో ప్రతిభ చాటిన ఎస్ఐ సందీప్

12-03-2025 02:51:33 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): కృషి పట్టుదల ఉంటె సాధించలేనిది ఏమీ లేదనేది చూపించారు. ఒకవైపు ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే మరో వైపు ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించే ప్రక్రియ కొనసాగించారు. ఆయనే ఇల్లందు పట్టణ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్(Yellandu Town Police Station Sub-Inspector)గా విధులు నిర్వహిస్తున్న దొడ్డపునేని సందీప్. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గ్రూఫ్ ఫలితాలలో(TGPSC Group-II results) మెరుగైన మార్కులు సాధించి తన ప్రతిభ చాటారు.

సందీప్ స్వస్థలం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామం, పూర్తిగా వ్యవసా య కుటుంబానికి చెందిన తను ఏన్కూరు రెసిడెన్షియల్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివి, ఇంటర్ శ్రీచైతన్య, బిటెక్ హైద్రాబాద్లో పూర్తిచేసి పోటీ పరిక్షలకు సిద్ధమయ్యాడు. ఎస్ఐతో పాటు గ్రూప్ 4, రైల్వేలో రెండు ఉద్యోగా లు, పంచాయితీ కార్యదర్శి, ఫారెస్టు విభాగాలలో ఉద్యోగాలు సంపాదించారు. ప్రస్థుత గ్రూప్ ఫలితాలలో 502 మార్కులు సాధించిన సందీప్ ఆర్డివో గాని డిఎస్పి అయ్యే అవకాశం వుంది. సందీప్ ను  ఇల్లందు డిఎస్పి చంద్రభాను, సిఐ బత్తుల సత్యనారాయణ తో పాటు పలువురు అధికారులు అభినందించారు.