కామారెడ్డి (విజయక్రాంతి): కామరెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు దేవునిపల్లి ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో రికవరీ చేసి సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై బాధితులకు అందజేశారు. సి ఈ ఐ ఆర్ నెంబర్ ను ద్వారా సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్సై తెలిపారు. కొండాపూర్ కు చెందిన జయరాం రెడ్డి లింగాపూర్ కు చెందిన రాజు బివిపేటకు చెందిన సత్తయ్య లా సెల్ ఫోన్లను రికవరీ చేసి వారికి అందజేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.