calender_icon.png 23 April, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమైన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎస్సై

22-04-2025 07:38:06 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని రేపల్లివాడ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన ఓ కుటుంబానికి మంగళవారం నాడు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్(SI Mahesh) ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రేపల్లెవాడ గ్రామానికి చెందిన కుమ్మరి పెద్ద నాగయ్య నివాసపు గుడిసె ఈనెల 13వ తారీకు నాడు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై ఇంట్లోనే సిలిండర్ పేలీ పూర్తిగా దగ్ధమైందని, ఈ ఘటనలో తీవ్ర నష్టం జరిగి కేవలం కట్టుబట్టలతో వారు మిగిలిపోయారన్నారు.

ఆ కుటుంబం ప్రస్తుతం అతి దుర్భర పరిస్థితిలో ఉందని తెలిసిన వెంటనే రేపల్లివాడ గ్రామానికి చేరుకుని వారిని పరమర్శించి ఆర్థిక సహాయం అందించామని అన్నారు. వారి కుటుంబానికి తోచినంత సహాయం అందించడానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సహాయం అందించేవారు వారి ఎస్బిఐ బ్యాంక్ ఖాతా 34338243777, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN0020118 నంబర్ కి విరాళాలు పంపవచ్చని తెలిపారు.