calender_icon.png 24 January, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గ్రామసభ’లో ఎస్సై ఓవర్ యాక్షన్

22-01-2025 01:12:07 AM

* ఉపాధి హామీ డబ్బులు రాలేవని సెక్రటరీని నిలదీసిన వ్యక్తిని అడ్డగింత

* వీడియో తీసిన జర్నలిస్టు ఫోన్ గుంజుకునేందుకు యత్నం

* చేవెళ్ల మండలం ముడిమ్యాలలో ఘటన

చేవెళ్ల, జనవరి 21: ప్రభుత్వం ఆరుగ్యారంటీల అమలులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలో చేవెళ్ల ఎస్సై సంతోష్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశారు. సమస్యపై సెక్రటరీని నిలదీసిన వ్యక్తిని అడ్డుకోవడమే కాకుండా తీసుకెళ్లి లోపల వేయాలని సిబ్బందిని ఆదేశించారు. అంతేకాదు ఇదంతా వీడియో తీస్తున్న జర్నలిస్టు ఫోన్ గుంజుకునేందుకు యత్నించారు.

  మంగళవారం చేవెళ్ల మండలం ముడిమ్యాలలో ఎంఈవో, గ్రామ స్పెషలాఫీసర్ పురందేశ్వర్, సెక్రటరీ షమీమ్ సుల్తానా ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఎజెండాలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు లబ్ధిదారులు పేర్లు చదవి వినిపించిన అనంతరం కూలీలకు రూ.12 వేలు ఇచ్చే ఆత్మీయ భరోసా గురించి వివరించారు.

ఇందులో భాగంగా భూమి లేకపోవడంతో పాటు 202425 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. అయితే గ్రామానికి చెందిన యంజాల మల్లేశ్ తాము ఇటీవల ఉపాధి హామీ కింద గ్రామ నర్సరీలో పనులు చేశామని ఆ డబ్బులు ఇంకా రాలేవని సెక్రటరీని నిలదీశాడు. అయితే ఆమె బ్యాంక్ స్టేట్ మెంట్ తీసుకొస్తే చెక్ చేసి వేస్తామని సమాధానం ఇచ్చారు.

దీంతో మల్లేశ్ తాను ఇప్పటికే రెండు మూడు సార్లు స్టేట్మెంట్ ఇచ్చానని, అయినా డబ్బులు రాలేవని చెప్పారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరగగా.. ఎస్త్స్ర కలుగజేసుకొని అతన్ని తీసుకెళ్లి లోపల వేసి సాయంత్రం వదిలిపెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో సమావేశంతో పాటు ఈ ఘటనను కూడా విడీయో తీస్తున్న ‘విజయక్రాంతి’ జర్నలిస్టు ఫోన్ గుంజుకునేందుకు యత్నించాడు.

గ్రామస్తులంతా ఎంత మందిని లోపల వేస్తారు.. సమస్యల గురించి అధికారులను అడుగొద్దా.. ? సభను కవర్ చూసిన రిపోర్టర్ల ఫోన్లు గుంజుకునేడేంది..? అని నిలదీయడంతో వెనక్కి తగ్గారు.  అంతకుముందు ఇదే సభలో గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాజామోయినుద్దీన్ సైతం గ్రామంలో చాలా వార్డుల్లో వీధి లైట్లు రావడం లేదని, పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని, ఏం చేస్తు న్నారని సెక్రటరీని నిలదీశారు.

ఇతిన్ని కూడా  ఎస్త్స్ర అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కువ మాట్లా డుతున్నావు... ప్రివెంటింవ్ యాక్షన్(ముందస్తు చర్య) తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఆయన సమస్యల గురించి మాట్లాడకుంటే గ్రామ సభ ఎందుకని అసహనం వ్యక్తం చేశారు.