12-03-2025 08:59:58 PM
ఎస్ఐ మహమ్మద్ గౌస్
కొల్చారం,(విజయక్రాంతి): సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మహమ్మద్ గౌస్ సూచించారు. మంగళవారం రాత్రి మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని అంసాన్ పల్లి గ్రామంలో పోలీస్ కళాజాత బృందంచే సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ... ఆన్లైన్ మోసాలకు పాల్పడేవారు ప్రజలను మభ్యపెడుతూ కొత్త కొత్త నంబర్ల నుండి ఫోన్లు చేస్తూ ఓటీపీలు చెప్పమని మీకు డబ్బులు వచ్చాయని ఫోన్లు చేస్తుంటారు వాటిని నమ్మవద్దని అన్నారు. రోడ్ యాక్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని రోడ్డుపై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వెల్లడించారు. మరియు చైల్డ్ మ్యారేజెస్ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాబృందం ఇంచార్జ్ హెడ్ కానిస్టేబుల్ సురేందర్ వారి బృందం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.