calender_icon.png 26 December, 2024 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన ఎస్ఐ అరెస్ట్

08-11-2024 08:18:02 PM

ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడి

వర్ని,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఎస్ఐ కృష్ణ కుమార్ ను కోటయ్య క్యాంపుకు చెందిన నాగరాజు అనే రైతు నుంచి 20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. రైతు నాగరాజు ఇతరులతో గొడవ పడగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్ఐ 50 వేలు డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపినట్లు ఆయన తెలిపారు. చివరకు 20 వేలు ఇస్తానని నాగరాజు ఎస్ఐ కృష్ణ కుమార్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అతడు ఏసీబీ అధికారులను సంప్రదించి ఎస్సై 20 వేలు లంచం కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అతనికి 20 వేలు తమ డిపార్ట్మెంట్ కు సంబంధించిన రూపాయలను ఇచ్చి శుక్రవారం ఎస్సై కృష్ణ కుమార్ కు ఇచ్చేందుకు వెళ్లగా అతడు తీసుకొనడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు అతని వద్ద నుంచి 20వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం అతనిని అరెస్టు చేసి హైదరాబాద్ లోని ఏసీబీ పోటుకు జడ్జి ఎదుట ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు.