16-04-2025 12:42:40 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): కేసు విచారణ కోసం వెళ్లిన ఎస్ఐ రోడ్డు ప్రమాద బాధితుడి కుటుంబ పరిస్థితి చలించిపోయి 5వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ మండలం బొట్యా తండాలో జరిగింది. తండాకు చెందిన ధరం సోత్ నవీన్ వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలో వంట చేయడానికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరాడు. ఈ నేపథ్యంలో మరిపెడ ఎస్సై బొలగాని సతీష్ కుమార్ రోడ్డు ప్రమాద కేసు దర్యాప్తు నిమిత్తం నవీన్ ఇంటికి వెళ్లగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందినప్పటికీ నవీన్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం, మంచానికే పరిమితం కావడంతో నవీన్ భార్య అతనికి సేవ చేస్తూ.. ఇంటిపట్టునే ఉండడం వల్ల ఆర్థికంగా చితికిపోయి పూట గడవని దీనస్థితిని చూసిన ఎస్ఐ వెంటనే చలించిన ఎస్ఐ వెంటనే తక్షణ సహాయంగా 5వేల రూపాయలను అందించారు. అలాగే దాతలు నవీన్ కుటుంబానికి అండగా నిలవాలని కోరాడు.